Listen on AM 1050
Every Saturday 12:00 - 3:00 PM
Studio Number : 713-461-8313
by
SriSatya
ఇంతకు ముందు విభాగంలో "అందం నా హక్కు.. శీతాకాలంలో చర్మ సంరక్షణ " లో "రోజ్ కోల్డ్ క్రీం" తయారి విధానం తెలుసుకున్నాం.ఇప్పుడు "రోజ్ హ్యాండ్ లోషన్ మరియు రోజ్ రూట్ వాటర్" తయారుచేసుకునే విధానం గురించి తెలుసుకుందాం.
రోజ్ హ్యాండ్ లోషన్:
కావలసిన పదార్దాలు మరియు తయారి విధానం:
- పన్నీరు -3 టేబుల్ స్పూన్స్,
- గ్లిజరిన్-3 టేబుల్ స్పూన్స్,
- ఆల్కహాల్-3 టేబుల్ స్పూన్స్,
- నిమ్మ రసం-1 టేబుల్ స్పూన్,
- కమలా పండు రసం-1 టేబుల్ స్పూన్,
- వెనీగర్- 1 టేబుల్ స్పూన్ ఇవన్నీ ఒక బోటల్లో వేసి బాగా కలియబెట్టాలి. అంతే "రోజ్ హ్యాండ్ లోషన్" రెడీ దీనిని ఏ సీజన్ లోనైనా వాడవచ్చు.
"రోజ్ రూట్ వాటర్":తయారి విధానం:గులాభి మొక్క వేరును చిదిమి ఒక పాత్రలో వేసి తగినన్ని నీటిని వేసిమూత పెట్టి చిన్న మంట మీద ఒక గంట సేపు మరిగించాలి. చల్లారిన తరువాత ఆ నీటిని ఒక బాటిల్ లో వేసుకుని ఫ్రిజ్ లో పెట్టుకుని వాడుకోవచ్చు. ఇది జిడ్డు చర్మానికి బాగా పని చేస్తుంది. ఈవాటర్ ని ఒక కప్పు లోనికి తీసుకుని దూదిని ముంచి ముఖాన్ని తుడిస్తే చర్మం బాగా శుభ్రపడుతుంది.